అమ్మాయిలూ.. రాహుల్​ ముందు జాగ్రత్త: మాజీ స్వతంత్ర ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

  • ఆయనకు పెళ్లికాలేదు.. జాగ్రత్తగా ఉండాలని సూచన
  • ఆయన ముందు కనీసం నిలబడకూడదని కామెంట్
  • రాహుల్ ఎప్పుడూ అమ్మాయిల కాలేజీలకే వెళ్తారని మాజీ ఎంపీ జాయ్స్ జార్జ్ వ్యాఖ్య 
  • ఎంపీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపాటు
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై కేరళకు చెందిన మాజీ స్వతంత్ర ఎంపీ జాయ్స్ జార్జ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీపీఎం అభ్యర్థి, మంత్రి ఎంఎం మణికి మద్దుతుగా నిర్వహించిన సభలో పాల్గొన్న ఆయన.. రాహుల్ గాంధీ పట్ల అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆయనకు ఇంకా పెళ్లి కాలేదని, ఆయన ముందు వంగకూడదని అన్నారు.

‘‘రాహుల్ గాంధీ ఎప్పుడూ అమ్మాయిల కాలేజీలకే వెళుతుంటారు. అక్కడికి పోయి వంగాల్సిందిగా అమ్మాయిలకు చెబుతుంటారు. అమ్మాయిలూ.. దయచేసి రాహుల్ ముందు వంగకండి. ఆయన ముందు అసలు నిలబడకండి. ఆయనకు ఇంకా పెళ్లి కాలేదు’’ అంటూ ఇడుక్కీ మాజీ ఎంపీ అయిన ఆయన వ్యాఖ్యానించారు.

జార్జ్ మాటలకు పక్కనే ఉన్న మంత్రి ఎంఎం మణి నవ్వుతూ కనిపించారు. ఆ వీడియో కాస్తా వైరల్ కావడంతో జార్జ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. జార్జ్ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండించింది. కేరళలో సీపీఎంకు ఓటమి భయం పట్టుకుందని విమర్శించింది.

Rahul Gandhi
Kerala
CPM
Congress

More Telugu News